అజారుద్దీన్‌పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
Complaint against Azharuddin in HRC. హైద్రాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
By Medi Samrat Published on
23 Sep 2022 8:58 AM GMT

హైద్రాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. టికెట్ల విషయం లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని.. అజారుద్దీన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. పదవి నుండి తొలగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మైన్ రాచాల యుగంధర్ గౌడ్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జ్‌కు కారకుడైన అజారుద్దీన్ తో పాటు హెచ్‌సీఏ నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
జింఖాన గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ తో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణం అని పేర్కొన్నారు. ఉప్పల్ లో జరగబోయే ఇండియా, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ కు ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని అన్నారు. హెచ్‌సీఏ క్రీడాభిమానుల నుండి లక్షల, కోట్ల రూపాయలు దండుకొని.. టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. హెచ్‌సీఏ, ఇతర రాజాకీయ నాయకులు క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Next Story