కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ దేశానికే మణిహారం

Command Control Center is a boon for the country Minister Talasani. కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ దేశానికే మణిహారం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు

By Medi Samrat
Published on : 2 Aug 2022 12:54 PM IST

కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ దేశానికే మణిహారం

కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ దేశానికే మణిహారం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణం చేపట్టింద‌ని పేర్కొన్నారు. సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించామ‌ని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ ఏర్పాటు చేశారని వెల్ల‌డించారు. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించామని తెలిపారు.

నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని హోమ్ మినిష్టర్‌తో స‌హా ఆయ‌న‌ సందర్శించి పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ భ‌వ‌నాన్ని ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కమాండ్ కంట్రోల్ వద్ద పనులు పూర్తి అవుతున్నాయి. అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత భద్రత పెరగనుందని వెల్ల‌డించారు. ప్రతి ఒక్క ప్రాంతం కమాండ్ కంట్రోల్ అండర్ లో ఉంటుందని వెల్ల‌డించారు.

మంత్రుల వెంట క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌నాన్ని సంద‌ర్శించిన వారిలో డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైద్రాబాద్ సిపి సివి ఆనంద్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ లు ఉన్నారు.


Next Story