హైదరాబాద్: కండ్లకోయలోని సీఎంఆర్ బాలికల హాస్టల్‌లో కొద్దిరోజుల క్రితం కాలేజీ ఆవరణలో పెద్దఎత్తున విద్యార్థినుల నిరసనలు తెలిపారు. తమ వీడియోలను సీక్రెట్ గా రికార్డు చేశారంటూ అమ్మాయిలు ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వంట సిబ్బందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని బీహార్‌కు చెందిన నంద కిషోర్ కుమార్ (20), గోవింద్ కుమార్ (20)లుగా గుర్తించారు. వీళ్ళు వంటగది సిబ్బందిగా పనిచేస్తున్నారు.బోవెన్‌పల్లికి చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి సోదరుడు చామకూర గోపాల్‌రెడ్డిని కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఏ7గా రికార్డు చేశారు. బోవెన్‌పల్లికి చెందిన గోపాల్‌రెడ్డి కళాశాల చైర్మన్‌గా ఉన్నారు.
గోపాల్‌రెడ్డితోపాటు శ్రీనివాసనగర్‌కు చెందిన కళాశాల డైరెక్టర్ మాదిరెడ్డి జంగారెడ్డి, మౌలాలిలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన ప్రిన్సిపల్ వరాహబట్ల అనంతనారాయణ, కండ్లకోయలో నివాసం ఉంటున్న ఇద్దరు హాస్టల్ వార్డెన్‌లు కేవీ ధనలక్ష్మి, అల్లం ప్రీతిరెడ్డి పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచినట్లు మేడ్చల్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ బి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు సభ్యులకు వేర్వేరుగా నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు.