బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేయనున్న సీఎం రేవంత్

మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం అంబర్ పేట బతుకమ్మ కుంటను సందర్శించారు.

By -  Medi Samrat
Published on : 23 Sept 2025 9:03 PM IST

బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేయనున్న సీఎం రేవంత్

మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం అంబర్ పేట బతుకమ్మ కుంటను సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5:00 గంటలకు బతుకమ్మ కుంటను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ క్ర‌మంలో ఇరువురు బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు ప‌రిశీలించారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కృషి మేరకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని కబ్జా నుండి బతుకమ్మ కుంట భూమి స్వాధీనం చేసుకొని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హైడ్రాకి వీహెచ్‌ అభినందనలు తెలిపారు. ఈ క్ర‌మంలోనే 26న పార్టీలకి అతీతంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్య‌క్రమంలో పాల్గొనాలని వీహెచ్ కోరారు.

ఇదిలావుంటే.. వీహెచ్ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 14న బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయి.

Next Story