రేపు హైద్రాబాద్‌కు ఏపీ సీఎం జ‌గ‌న్‌

CM Jagan will pay tribute krishna mortal remains wednesday. సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

By Medi Samrat  Published on  15 Nov 2022 2:59 PM GMT
రేపు హైద్రాబాద్‌కు ఏపీ సీఎం జ‌గ‌న్‌

సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ కు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.20 గంటలకు పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుంటారు. అక్కడ సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదిలావుంటే.. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో.. కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న సూప‌ర్ స్టార్‌ కృష్ణ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Next Story