రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో హైకోర్టు జోన్-II భవన నిర్మాణాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా, ఇప్పటికే ప్రధాన భవన పనులు కొనసాగుతుండగా, రెండో దశలో న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరచడానికి, అత్యాధునిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.