మారేడ్ పల్లి సీఐ కేసు : రిమాండ్ రిపోర్టులో వెలుగులోకి కీలక విషయాలు..

CI Nageswara Rao Remand Report. మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు కేసులో సంచలన విషయాలు రిమాండ్ రిపోర్టులో

By Medi Samrat  Published on  13 July 2022 3:00 PM GMT
మారేడ్ పల్లి సీఐ కేసు : రిమాండ్ రిపోర్టులో వెలుగులోకి కీలక విషయాలు..

మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు కేసులో సంచలన విషయాలు రిమాండ్ రిపోర్టులో బయటకు వస్తున్నాయి. అధికారుల దర్యాప్తులో సీఐ నాగేశ్వరరావు నేరం అంగీకరించారు. దీంతో హత్యాయత్నం, అత్యాచారం, బెదిరింపులతో ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీఐ సర్వీస్‌ రివాల్వర్‌, దుస్తులు సేకరించారు. బాధితురాలి ఇంటి దగ్గరలోని ఎలక్ట్రికల్‌ షాప్‌లో సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. అనంతరం బాధితురాలికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు.

రిపోర్టు విషయాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించగా నివేదిక రావాల్సి ఉంది. సీన్‌ ఆఫ్ ఆఫెన్స్‌లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. రెండు గాజులు, తల వెంట్రుకలు, బెడ్‌షీట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం కారు ప్రమాదం గురించి వివరాలు సేకరించారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయాడు మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న రాత్రి ఆ సీఐని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Next Story
Share it