ఎల్బీనగర్ చట్నీస్‌లో భారీ పేలుడు..ముగ్గురు సిబ్బందికి గాయాలు

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ 'చట్నీస్' (Chutneys) హోటల్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది.

By -  Knakam Karthik
Published on : 20 Feb 2026 4:39 PM IST

Crime News, Hyderabad, LB Nagar, Chutneys Hotel, Cylinder Blast, Hotel Accident

ఎల్బీనగర్ చట్నీస్‌లో భారీ పేలుడు..ముగ్గురు సిబ్బందికి గాయాలు

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ 'చట్నీస్' (Chutneys) హోటల్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఇడ్లీలు తయారు చేసే స్టీమర్ ఒక్కసారిగా పేలిపోవడంతో హోటల్ ఒక్కసారిగా దద్దరిల్లింది. వంట గదిలో ఇడ్లీ స్టీమర్ భారీ శబ్దంతో పేలడంతో కస్టమర్లు భయాందోళనతో హోటల్ బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఈ ప్రమాదాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు చట్నీస్ యాజమాన్యం అతంత గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, భారీ శబ్దం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై ఆరా తీస్తున్నారు. హోటల్‌లో భద్రతా నిబంధనల పాటించారా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Next Story