సొంత ఖర్చులతో దేవాలయానికి రోడ్డు మరమ్మతు చేయించుకుంటున్నారు చిలుకూరి బాలాజీ స్వామి వారు. ఆలయానికి వెళ్లే రహదారి మొత్తం గుంతలమయం అయ్యింది. ఆ రహదారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతంలోనే రోడ్డు పనులు శాంక్షన్ అయినా మరమ్మత్తుకు నోచుకోలేదు. అనేక సార్లు గుంతలమయమైన రోడ్డును మట్టితో పూడ్చి భక్తులకు కొంతైనా ఇబ్బందిని తగ్గించే ప్రయత్నం చేశారు ఆలయ చైర్మన్ సుందర రాజన్ నేతృత్వంలోని సిబ్బంది. కానీ వారి ప్రయత్నం కొంతవరకే పని చేసింది. భక్తులు మళ్లీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ద్విచక్ర వాహనాల పైనుంచి కింద పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన ఆలయ చైర్మన్ సుందర రాజన్ గుంతలు పూడ్చే కార్యక్రమానికి బుధవారం నాంది పలికారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండ అతి త్వరలో పనులు పూర్తి చేయనున్నారు.