Child Trafficking: హైదరాబాద్‌లో చైల్డ్‌ ట్రాఫికింగ్ కలకలం.. పిల్లల్ని తీసుకొచ్చి అమ్మేస్తున్నారు.. ఒక్కో శిశువుకు రూ.15 లక్షలు!

హైదరాబాద్‌ నగరంలో చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కలకలం రేపింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By -  అంజి
Published on : 24 Dec 2025 1:39 PM IST

Child Trafficking Racket, Hyderabad, Crime

Child Trafficking: హైదరాబాద్‌లో చైల్డ్‌ ట్రాఫికింగ్ కలకలం.. పిల్లల్ని తీసుకొచ్చి అమ్మేస్తున్నారు

హైదరాబాద్‌ నగరంలో చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కలకలం రేపింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మందిని అరెస్ట్‌ చేసి ఇద్దరు పిల్లల్ని రక్షించారు. ఈ ముఠా సభ్యులు సిటీలోని ఎనిమిది ఆస్పత్రులకు ఏజెంట్లుగా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో శిశువు విక్రయం ద్వారా రూ.15 లక్షల లావాదేవీలు జరిగినట్టు ఇన్వేస్టిగేషన్‌లో బయటపడ్డింది.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో 15 మంది పిల్లలను అమ్మిన 12 మంది వ్యక్తులను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు 8 ఆసుపత్రులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఠా నుంచి ఇద్దరు పసికందులను ఎస్‌ఓటీ పోలీసులు కాపాడారు. హైదరాబాద్‌లోని పిల్లలతో పాటు అహ్మదాబాద్ నుంచి తెచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కొక్క శిశు అమ్మకం వెనకాల రూ.15 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిసింది.

పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని, చట్టవిరుద్ధంగా శిశువులను సరఫరా చేస్తూ ఒక్కో పసికందు అమ్మకం వెనుక రూ.15 లక్షల వరకు లావా దేవీలు జరిగినట్లు సమాచారం. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ముఠాను అరెస్టు చేశారు. రక్షించిన ఇద్దరు పసికందులను శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై అనుమానాలు ఉండటంతో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.ఈ ఘటన నగరంలో కలకలం రేపగా, ఇలాంటి అక్రమ శిశు రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Next Story