చికోటి ప్రవీణ్‌కు ఊర‌ట‌

Chikoti Praveen granted anticipatory bail from napally court. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్.. ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం వెంటాడుతూ ఉంటుంది.

By Medi Samrat
Published on : 26 July 2023 7:30 PM IST

చికోటి ప్రవీణ్‌కు ఊర‌ట‌

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్.. ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం వెంటాడుతూ ఉంటుంది. ఇటీవల చికోటి ప్రవీణ్ ప్రైవేట్ గన్‌మెన్లతో లాల్ దర్వాజ సింహవాహని అమ్మవారి బోనాలకు వెళ్లారు. చికోటి ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లైసెన్స్‌లు రెన్యూవల్‌ చేయకుండా గన్‌లు వాడుతున్నారన్న ఆరోపణలతో నిందితులపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ప్రవీణ్‌ను ఈ కేసులో ఏ1గా మార్చారు. అయితే ఈ కేసులో ఎట్టకేలకు ప్రవీణ్ కు ఊరట లభించింది. అనుమతులు లేకుండా గన్స్​ క్యారీ చేశారన్న కేసుకు సంబంధించి చికోటి ప్రవీణ్​కి కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్​ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది.

ప్రవీణ్ ముగ్గురు గన్‌మెన్‌లు రమేష్‌గౌడ్‌, సుందర్‌నాయక్‌, రాకేష్‌కుమార్‌లను రిమాండ్‌కు తరలించి వారి నుంచి గన్స్​ స్వాధీనం చేసుకున్నారు.అయితే తనను ఈ కేసులో కుట్రపూరితంగా ఏ1గా చేర్చారంటూ ప్రధాన నిందితుడు ఆరోపించారు. ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. పలు ఘటనలకు సంబంధించి క్యాసినో కింగ్ పై ఇప్పటికే ఎన్నో కేసులు నమోదయ్యాయి.


Next Story