ఇవాళ చార్మినార్‌ వద్ద సండే - ఫండే సందడి.!

charminar sunday funday. ప్రతి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నగరవాసులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం సండే -

By అంజి  Published on  17 Oct 2021 10:57 AM IST
ఇవాళ చార్మినార్‌ వద్ద సండే - ఫండే సందడి.!

ప్రతి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నగరవాసులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం సండే - ఫండే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ సాయంత్రం చార్మినార్‌ వద్ద 'ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌' పేరుతో సండే - ఫండే కార్యక్రమం జరగనుంది. ఇప్పటి వరకు ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం జరుగుతున్న సండే - ఫండే కార్యక్రమం జరుగుతోంది. నిత్యం టూరిస్ట్‌లు, వ్యాపారులతో రద్దీగా ఉండే చార్మినార్‌ వద్ద ఇవాళ ఆహ్లాదకర వాతావరణం కనిపించనుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. 6.30 గంటలకు పోలీస్‌ బ్యాండ్‌, రాత్రి 8.30 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే అర్థరాత్రి వరకు లాడ్‌ బజార్‌ను తెరిచి ఉండనుంది. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. ఇక ఆహార ప్రియుల కోసం స్పెషల్ ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రయాణికుల వాహనాల కోసం నాలుగు స్థలాల్లో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు.

Next Story