Hyderabad: స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ చోరీ.. వీడియో

వరల్డ్‌ వన్‌ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ దొంగతనానికి పాల్పడింది. చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు మార్చి 16వ తేదీ శనివారం అర్థరాత్రి సుమారు రూ.8 లక్షలను దోచుకున్నారు

By అంజి  Published on  18 March 2024 1:25 AM GMT
Chaddi gang, Hyderabad, school

Hyderabad: స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ చోరీ.. వీడియో

హైదరాబాద్‌: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్‌ దొంగతనానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మొన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరల్డ్‌ వన్‌ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ దొంగతనానికి పాల్పడింది. చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు మార్చి 16వ తేదీ శనివారం అర్థరాత్రి సుమారు రూ.8 లక్షలను దోచుకున్నారు. ఈ ఘటన పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. నివేదికల ప్రకారం, దొంగలు చడ్డీ (లోదుస్తులు) మాత్రమే ధరించి వచ్చి పాఠశాల కౌంటర్ నుండి రూ.7,85,000 నగదును అపహరించారు. దీంతో స్కూల్ యాజమాన్యం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్ పేట్ వరల్డ్ వన్ స్కూల్‌లోకి మొన్న అర్ధరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా చెడ్డీ గ్యాంగ్‌ ప్రవేశించింది. ఏడు లక్షల 85 వేలు..(7,85,000/-) రూపాయలను తీసుకొని అక్కడి నుండి గ్యాంగ్‌ పారిపోయింది. ఉదయం స్కూలుకు వచ్చిన సిబ్బంది.. దొంగలు పడ్డట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. అయితే దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. సీసీ కెమెరాలో కనిపిస్తున్న ఇద్దరు దుండగులు చెడ్డీలు వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతకుముందు కూడా చడ్డీ గ్యాంగ్‌ నగరంలో హల్‌చల్‌ చేసింది. నివేదికల ప్రకారం.. ముఠా సభ్యులు ఎలాంటి బట్టలు ధరించరు. వారి శరీరాలపై నూనె రాసుకోవడం వల్ల వారిని పట్టుకోవడం కష్టమవుతుంది.

Next Story