పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మంది బడాబాబులు.. ఎమ్మెల్యే కూడా.!

Celebrities caught playing poker in Hyderabad. హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ బడాబాబుల ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By అంజి  Published on  1 March 2022 3:24 AM GMT
పేకాట ఆడుతూ పట్టుబడ్డ  8 మంది బడాబాబులు.. ఎమ్మెల్యే కూడా.!

హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ బడాబాబుల ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లును అరెస్ట్‌ చేసిన పోలీసులు రూ. కోటి 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిలో ఓ ఎమ్మెల్యే సైతం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేను వదిలేసిన పోలీసులు.. మిగతా వారిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. మాదాపూర్‌ కాకతీయ హిల్స్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో మాదాపూర్‌ డీసీపీ రంగంలోకి దిగారు.

నగరంలోని ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు డీసీపీకి సమాచారం అందింది. ఈ మేరకు పేకాట డెన్‌పై సిబ్బందితో కలిసి డీసీపీ దాడులు చేశారు. పట్టుబడ్డ ముఠాలో ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. పేకాటరాయుళ్లు నగరంలోని అత్యంత సంపన్నులు ఉండే ఫ్లాట్‌లో పేకాట నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. పట్టుబడిన వారిలో ఎమ్మెల్యే ఉన్నాడని వివరాలు బయటకు రావడంతో, వారిని కాపాడేందుకు నిందితుల వివరాలను రహస్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it