అర్థరాత్రి మాదాపూర్‌లో కారు బీభత్సం
Car overturned at Madhapur.శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత మాదాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది.
By తోట వంశీ కుమార్ Published on
3 Sep 2022 3:19 AM GMT

శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని కారులో ఉన్న యువతి, యువకుడిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణంగా బావిస్తున్నారు. కాగా.. ప్రమాద సమయంలో యువతి కారు నడిపినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
Next Story