హైదరాబాద్‌ నగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలో రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం రాత్రి సికింద్రాబాద్‌లోని మదర్‌ థెరిస్సా విగ్రహం వద్ద అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో.. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ కారును ఆపేశాడు. ఆ తర్వాత కారులో ఉన్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే కారులో చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు. కారులోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సికింద్రాబాద్‌ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story