ఎల్బీ నగర్ లో విషాదం

Car Driver Negligence Killed Tow Years Old Baby In Hyderabad Lb Nagar. హైదరాబాద్‌ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  2 Jun 2023 10:00 AM GMT
ఎల్బీ నగర్ లో విషాదం

హైదరాబాద్‌ ఎల్బీ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మన్సూరాబాద్‌-ఎల్బీనగర్‌ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ హఠాత్తుగా కారు డోర్‌ తీశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన బైక్‌కు కారు డోర్‌ తగిలింది. దీంతో బైక్‌పై ఉన్న దంపతులు సహా రెండేళ్ల చిన్నారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ధనలక్ష్మి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాప తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story