ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా గంజాయి అమ్మకం

Cannabis smuggler arrested by Hyderabad Police.మాదక ద్రవ్యాల తరలింపుకు స్మగ్లర్లు వివిధ మార్గాలు ఎంచుకుంటూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 2:19 PM IST
ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా గంజాయి అమ్మకం

మాదక ద్రవ్యాల తరలింపుకు స్మగ్లర్లు వివిధ మార్గాలు ఎంచుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది.. ఎన్నో రకాలుగా మాదక ద్రవ్యాలను విక్ర‌యిస్తున్నారు. తాజాగా ఇన్ స్ట్రా గ్రామ్ ద్వారా హైదరాబాద్ లో గంజాయి అక్రమంగా అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఒమర్‌ఖాన్‌ ఇంటర్ మధ్యలో ఆపేశాడు. అప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి ఆదిలాబాద్‌ అడవుల్లో జశ్వంత్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను గంజాయిని ఇతడికి విక్రయించేవాడు. అతని వద్ద ఒమర్ ఖాన్ గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్నాడు. అతడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా 20 గ్రాముల గంజాయి ప్యాకెట్‌ను రూ.1000కిఅమ్ముతూ ఉన్నాడు. ఈనెల 14న 1,160 గ్రాముల గంజాయిని అమ్మేందుకు నాంపల్లికి వెళ్లాడు.

అక్కడే ఓ లాడ్జిలో రూమ్‌ తీసుకుని బస చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జీపై దాడులు చేసి, ఒమర్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. అతడి దగ్గర సీజ్ చేసిన సరకు విలువ రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మరీ ఈ స్థాయిలో గంజాయిని అమ్ముతూ ఉండడం పోలీసులకు కూడా షాక్ గా అనిపిస్తోంది.

Next Story