జీహెచ్ఎంసీ విస్తరణ.. కొత్తగా చేరే ప్రాంతాలు ఇవే..!

జీహెచ్ఎంసీ విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

By -  Medi Samrat
Published on : 25 Nov 2025 6:57 PM IST

జీహెచ్ఎంసీ విస్తరణ.. కొత్తగా చేరే ప్రాంతాలు ఇవే..!

జీహెచ్ఎంసీ విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రివర్గం భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు ఆయన వెల్లడించారు. 27 మున్సిపాల్టీలను జీహెచ్‌ఎంసీలో విలీనానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు.

గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, పెద్ద అంబర్ పేట్, జల్ పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్ కేసర్, బోడుప్పల్ విలీనం చేయనున్నారు.

Next Story