సర్కార్ నడుపుతున్నరా? సర్కస్ నడుపుతున్నరా?..కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆగ్రహం

యాకుత్‌పురాలోని మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనపై కేటీఆర్ స్పందించారు.

By -  Knakam Karthik
Published on : 12 Sept 2025 2:48 PM IST

Telangana, Hyderabad News, Conrgress Government, Yakutpura Incident

హైదరాబాద్: యాకుత్‌పురాలోని మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. యాకుత్‌పురాలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో చిన్నారి పడిపోయిన వీడియోను తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్టు చేసిన ఆయన ఇలా రాసుకొచ్చారు. 'ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి..అని కేటీఆర్ అన్నారు.

తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే, తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది, ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి..అని ట్వీట్ చేశారు.

Next Story