మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకపై వాట్సప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల మెట్రోరైల్ కౌంటర్లలోని లైన్లలో నిలబడాల్సిన అవసరం తప్పుతుంది.
ఇలా టికెట్ కొనుగోలు చేయాలి..
- వాట్సాప్‌లో 8341146468 నంబరుకు హాయ్ అని మెసెజ్ చేయాలి
- అనంతరం ఓ లింకు వస్తుంది.
- ఏ స్టేషన్‌లో ఎక్కాలో ఏ స్టేషన్‌లో దిగాలో వంటి వివరాలు ఎంటర్ చేయాలి
- మీరు ఇచ్చిన వివరాలను బట్టి ఎంత మొత్తం చెల్లించాలనేది వస్తోంది
- యూపీఐ లేదా ఇతర పేమెంట్లు యాప్స్‌ను ఉపయోగించి సూచించిన మొత్తం చెల్లించాలి
- అనంతరం ఈ-టికెట్ వస్తుంది.
ఈ సౌకర్యాన్ని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు సీఈఓ, ఎండీ కెవీబీ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా తాము ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీని కోసం బిల్ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.