భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, టి రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా శివరాత్రి పూజా ఆచారాలలో ఉపయోగించే వస్తువులను ఆవు మాంసం తినే వ్యక్తుల నుండి కొనుగోలు చేయవద్దని, పవిత్రంగా ఉండే వ్యాపారుల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని హిందువులను కోరారు.
మహా శివరాత్రి పండుగకు ముందు సోమవారం నాడు విడుదల చేసిన వీడియోలో రాజా సింగ్ హిందువులు కొనే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శివ భక్తులు ఉపవాసం, ఆలయాన్ని సందర్శించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అత్యంత పవిత్రమైన రీతిలో పండుగను ఆచరిస్తారు. ఆలయానికి వెళ్లేటప్పుడు, భక్తులు పూజా సామాగ్రి పండ్లు, కొబ్బరికాయలు, అగరుబత్తీలు, పువ్వులు మొదలైన వాటిని పవిత్రమైన వ్యక్తుల నుండి కొనుగోలు చేయాలని గుర్తుంచుకోవాలి. శివుని పూజించే వ్యాపారుల నుండి మాత్రమే పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలి, ఆవు మాంసం తినే వారి నుండి కాదని తెలిపారు. ఇది శుభ సందర్భం, పూజా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు శివభక్తులు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే రాజా సింగ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో తెలిపారు.