జీహెచ్‌ఎంసీ ఎన్నికల మొక్కు తీర్చుకున్న బీజేపీ నేత‌లు

BJP leaders Visit Bagya lakshmi Temple. పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By Medi Samrat
Published on : 18 Dec 2020 1:18 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల మొక్కు తీర్చుకున్న బీజేపీ నేత‌లు

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజాసింగ్‌, బీజేపీ కార్పొరేటర్లు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నూత‌నంగా ఎన్న‌కైన‌ కార్పొరేటర్లతో అర్చ‌కులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు అనంతరం అమ్మవారి దేవాలయంలో మొక్కులు చెల్లించుకుంటామని గతంలో సంజయ్ చెప్పిన విషయం తెలిసిందే. అందులో బాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నూతన కార్పొరేటర్లతో కలసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలావుంటే.. నేడు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ నగరానికి రానున్నారు. రెండు రోజలపాటు నగరంలోనే ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు.


Next Story