రాంగోపాల్ వర్మపై పీఎస్‌లో ఫిర్యాదు

BJP leaders filed a complaint on RGV. వివాద‌స్ప‌ద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు

By Medi Samrat  Published on  24 Jun 2022 8:46 AM GMT
రాంగోపాల్ వర్మపై పీఎస్‌లో ఫిర్యాదు

వివాద‌స్ప‌ద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బ‌రిలో ఉన్న‌ ద్రౌపతి ముర్ము ను కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని బీజేపీ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అబిడ్స్ పోలీసులను కోరారు.

రాంగోపాల్ వర్మ త‌న ట్వీట్‌లో.. ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరు? మరి ముఖ్యంగా కౌరవులు అంటే ఎవరు? అంటూ రాశారు. వైర‌ల్ అయిన ఈ ట్వీట్‌పై బీజేపీ నాయ‌కులు ఫిర్యాదు చేశారు.


Next Story