రాజా సింగ్‌పై బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు

BJP High Command Suspends MLA Raja Singh. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను గోషామ‌హ‌ల్‌ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌

By Medi Samrat  Published on  23 Aug 2022 9:59 AM GMT
రాజా సింగ్‌పై బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను గోషామ‌హ‌ల్‌ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను బిజెపి అధిస్టానం మంగళవారం సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే రాజా సింగ్‌ వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అత‌నిని అరెస్ట్ చేశారు. పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినందుకు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌క్ష‌ణ‌మే పార్టీలోని అన్ని బాధ్య‌త‌ల నుంచి త‌న‌ను తొల‌గిస్తున్న‌ట్లు పేర్కొంది. పార్టీ నుంచి ఎందుకు బ‌హిష్క‌రించ‌కూడ‌దో 10 రోజుల్లో స‌మాధానం చెప్పాల‌ని షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సెప్టెంబర్ 2 లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించింది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.


హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా రాజాసింగ్‌.. యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో నిరసనకారుల ఆగ్రహం పెల్లుబికింది. రాజాసింగ్‌ వివాదాస్పద ప్రకటన తర్వాత.. ఆయనను అరెస్ట్‌ చేయాలంటూ చాలా చోట్ల ఫిర్యాదులు అందాయి. రాజా సింగ్‌పై ఫిర్యాదు చేయడానికి డబీర్‌పురా, భవానీ నగర్, రెన్‌బజార్, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లకు ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం ఆయనను అరెస్ట్ చేశారు. మునావర్ ఫరూఖీ షో ను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం నేతలు ఆరోపించారు.


Next Story