హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ చివరి సమావేశానికి దున్నపోతును తీసుకువెళ్తూ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలియజేశారు. "ముఖ్యమంత్రి, మేయర్ లేదా GHMC అధికారులకు విజ్ఞప్తి చేయడంలో అర్థం లేదు" అని కార్పొరేటర్లు తమ అసమ్మతిని నమోదు చేయడానికి దున్నపోతుతో వీధుల్లోకి వచ్చారు . జీహెచ్‌ఎంసీలో సమస్యలపై ప్రభుత్వానికి కంటే దున్నపోతుకు వినతిపత్రం అందజేయడం మంచిది" అని కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ఎన్నోసార్లు మేయర్, కమిషనర్‌కు సమస్యలపై వినతిపత్రం ఇచ్చాం. అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్లు ఎక్కడా కూడా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇప్పటికైనా మేయర్, కమిషనర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు.