హైదరాబాద్: అంబర్‌పేట్‌లో హైడ్రా అభివృద్ధి చేసిన బతుకుమ్మ కుంట ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాల్సిన బతుకుమ్మ కుంటను నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎక్స్‌లో వెల్లడించారు. వర్షం వల్ల ప్రారంభ కార్యక్రమంకు వచ్చే మహిళలు, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆమె రాసుకొచ్చారు. కాగా ఈనెల 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తారు..అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.