డీఏవీ పబ్లిక్ స్కూల్ తిరిగి తెరచుకోనుందా..?

Banjara Hills DAV School Reopen Update. బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ తిరిగి తెరచుకోడానికి అధికారులు ఒప్పుకున్నారు.

By Medi Samrat  Published on  26 Oct 2022 1:15 PM GMT
డీఏవీ పబ్లిక్ స్కూల్ తిరిగి తెరచుకోనుందా..?

బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ తిరిగి తెరచుకోడానికి అధికారులు ఒప్పుకున్నారు. విద్యా శాఖ కమీషనర్‌తో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ భేటీ ముగిసింది. డీఏవీ స్కూల్ రీ ఓపెనింగ్‌కు అధికారులు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వారంలోగా స్కూల్‌ను రీ ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యా శాఖ కమీషనర్ హామీ ఇచ్చినట్లుగా కథనాలు వచ్చాయి.

అత్యాచార ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అయితే పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో వుంచుకుని స్కూల్ రీ ఓపెనింగ్‌కు అనుమతించాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆదివారం బంజారాహిల్స్ లోని కెబిఆర్ పార్కు వద్ద డి ఏవి స్కూల్ కు చెందిన సుమారు 200 మంది తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తీసుకున్నారు. చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక అధికారి, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు, స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఒకరు చొప్పున కమిటీ ఏర్పాటు చేసి స్కూల్ తెరవాలని డిమాండ్ చేశారు.

బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఎస్ మాధవీపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.


Next Story