గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం
Baba Fasiuddin Won As A Corporator. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ నుంచి
By Medi Samrat Published on
4 Dec 2020 9:04 AM GMT

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం సాధించారు. మెజార్టీ కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువగానే వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేసి ఘన విజయం సాధించి డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ పార్టీ మెట్టగూడ, బోరబండ, యూసుఫ్ గూడ స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ 70 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 35 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్-03 స్థానాల్లో, ఎంఐఎం-26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్-బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. మరో రెండు, మూడు గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.
Next Story