నాపై దాడి చేసింది వాళ్లే.. సుఖీభవ బ్రో..!
Ayyayyo vaddamma sukhibhava bro sharath. ‘అయ్యయ్యో వద్దమ్మ.. సుఖీభవ సుఖీభవ..’ అనే వీడియో ఇటీవల ఎంత వైరల్‌గా మారిందో
By అంజి Published on 19 Oct 2021 6:40 PM IST'అయ్యయ్యో వద్దమ్మ.. సుఖీభవ సుఖీభవ..' అనే వీడియో ఇటీవల ఎంత వైరల్‌గా మారిందో అందరికీ తెలిసిందే. ఈ వీడియోతో బాగా పాపులర్ అయ్యాడు డ్యాన్సర్ నల్లగుట్ట శరత్. ఇప్పుడు అతడిని శరత్ అని పిలవకుండా.. చాలా మంది సుఖీభవ బ్రో అంటూ పిలుస్తున్నారు. అయితే తాజాగా సుఖీభవ బ్రోపై కొంత మంది దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్‌లతో విచక్షణా రహితంగా సుఖీభవ బ్రోపై దాడి చేశారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. అతడి కన్ను వాచిపోయింది. అతనికి గాయాలైన ఫొటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ దాడికి పాల్పడింది హిజ్రాలంటూ మొదట ప్రచారం జరిగింది. హిజ్రాలను కించపరిచేలా మాట్లాడాడని, అందుకే వారు దాడి చేశారని ప్రచారం జరిగింది.
దీనిపై సుఖీభవ బ్రో శరత్ స్పందించాడు. తనపై దాడి చేసింది హిజ్రాలు కాదని వెల్లడించాడు. హిజ్రాలు దాడి చేశారన్న వస్తున్న వార్తలు అవాస్తమన్నాడు. తనపై దాడికి పాల్పడింది ప్రత్యర్థులేనని, గతంలో తన చెల్లిన వేధిస్తున్నారని రెండు గ్రూపులపై దాడి చేశానన్నాడు. ఆ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించానని తెలిపాడు. ఇటీవల ఓ డ్యాన్స్ వేడుకలో శరత్.. టీపౌడర్ యాడ్‌ను రీక్రియేట్ చేసి, తనదైన స్టెప్పులతో బాగా ఫేమస్ అయ్యాడు. దీంతో అతనికి సినిమా, ఒక యాడ్ ఆఫర్ వచ్చింది. ఫేమస్ కావడంతోనే ఓ వర్గం వారు నాపై కక్ష గట్టి దాడికి పాల్పడ్డారని సుఖీభవ బ్రో శరత్ వెల్లడించాడు. ఇప్పటికీ కూడా సుఖీభవ.. సుఖీభవ.. అనే వీడియో బాగా ట్రెండ్ అవుతోంది.