హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వామి భక్తులు ఆందోళన చేపట్టారు. గంటల కొద్దీ విమానాలు ఆలస్యంపై ఎయిర్‌పోర్టులో అయ్యప్ప భక్తులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం పొగ మంచు కారణంగా విమాన సర్వీసును నిలిపివేశారు. దీంతో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దీంతో అయ్యప్పస్వామి భక్తులు సహా చాలా మంది ప్రయాణికులు నిన్నటి నుంచి ఎయిర్ పోర్టులో నిరీక్షిస్తున్నారు. అయితే విమానాల ఆలస్యంపై ఉద్యోగులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.