గుండె జబ్బులపై కేర్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

Awareness Program on Heart Disease by Care Hospital.వరల్డ్ హార్ట్ డే సంద‌ర్భంగా కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నందు గుండె

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Sep 2022 9:10 AM GMT
గుండె జబ్బులపై కేర్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

వరల్డ్ హార్ట్ డే సంద‌ర్భంగా కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నందు గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. పెరుగుతున్న నిశ్చల జీవనశైలిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ హెల్త్ అంచనాల ప్రకారం భారతీయుల మరణాలకు ప్రధాన కారణం కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) యొక్క నిశ్శబ్ద అంటువ్యాధి అని ఆయన పేర్కొన్నారు. గుండె జబ్బుల నివారణ కోసం ప్రివెంటివ్ హార్ట్ స్క్రీనింగ్‌లతో ఆరోగ్యాన్నిజాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను సూచించారు.

సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్ట‌ర్ వినోత్‌, డాక్ట‌ర్ అషితోష్ మాట్లాడుతూ.. నిశ్చల జీవనశైలి యువతలో గుండె జబ్బుల ప్రమాదానికి ఆజ్యం పోస్తుంద‌న్నారు. 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి నివారణ గుండె పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం అని అభిప్రాయపడారు .

కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా,ధనంజనేయ రెడ్డి, డా.పాండు రంగ మాట్లాడుతూ.. ధూమపానం, మద్యపానం, తక్కువ శారీరక శ్రమ, ఒత్తిడి, ఆందోళన మరియు అనారోగ్యకరమైన ఆహారం వంటి ఆధునిక జీవన శైలిప్రమాద కారకాలు కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతాయన్నారు. 70 నుంచి 80 శాతం గుండె జబ్బులను రెగ్యుల‌ర్ చెక్‌ల ద్వారా ముందుగా గుర్తించవ‌చ్చున‌ని త‌ద్వారా తొంద‌ర‌గా న‌యం చేసేందుకు వీలు ఉంటుంద‌ని చెప్పారు.

Next Story