హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్తత నెలకొంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు ఆపగా, అతడికి డ్రంకన్ డ్రైవ్ లో 150 వచ్చింది కేసు నమోదు చేసి ఆటోని సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు అనంతరం అతడు అకస్మాత్తుగా ఆటోలో నుండి పాము తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు.
ఈ ఘటన జరగడంతో చెక్‌పోస్ట్ వద్ద భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు మందు బాబును పట్టుకునే లోపే పాముతో సహా ఆటో డ్రైవర్ సంఘటన స్థలం నుండి పరారయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవింగ్‌తో పాటు పోలీసులను బెదిరించిన కేసులో ఆటో డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.