97857 43029 అనే ఫోన్ నంబరుకు డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టిన సైబర్ కేటుగాళ్లు కొందరిని డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇందులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులులు కూడా ఉన్నారు. సామాన్య ప్రజలకు డీజీపీ పేరుతో మెసేజ్లు వెళ్లినట్లు తెలుస్తోంది. డీజీపీ ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్లు రావడంతో పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
రాష్ట్ర పోలీస్ బాస్ పేరును వాడుతూ 97857 43029 అనే ఫోన్ నంబరుకు డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి.. డబ్బులు అడిగినట్టు తెలుస్తోంది. డీజీపీ ఫొటోతో ఉన్న వాట్సాప్ అకౌంట్ నుంచి డబ్బులు కావాలని మెసేజ్లు రావడంతో పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్య ప్రజలకు కూడా డీజీపీ పేరుతో మెసేజ్లు వెళ్లినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన సైబర్ క్రైం విభాగం దర్యాప్తు మొదలు పెట్టింది. ఇలాంటి వాటిని నమ్మకండని ప్రజలను సూచించింది.