Hyderabad: మల్కాజిగిరిలో మైనర్ బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. మల్కాజిగిరిలో మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి బెదిరించినట్లు పోలీసులు

By అంజి  Published on  20 Jun 2023 8:30 AM IST
Malkajigiri, minor girl, Crime news, Hyderabad

Hyderabad: మల్కాజిగిరిలో మైనర్ బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. మల్కాజిగిరిలో మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి బెదిరించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. అనుమానితుడు వరుణ్ తేజ్ (20) అనే ప్రైవేట్ ఉద్యోగి ప్రేమ సాకుతో బాలికను మోసం చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ప్రైవేట్ చిత్రాలు, వీడియోలను కూడా రికార్డ్ చేశాడు. వాటిని ఉపయోగించి బాధితురాలి నుండి డబ్బు, విలువైన వస్తువులను దోపిడీ చేశాడు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఇంకా అరెస్టును ప్రకటించలేదు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపారు. తరువాత మానసిక హెల్త్‌ సపోర్ట్ కోసం సదుపాయానికి పంపారు. కాగా, నిందితుడి అరెస్ట్‌ను నిరసిస్తూ కుటుంబ సభ్యులు సోమవారం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

Next Story