Hyderabad: దారుణం.. రూ.2 వేలు ఇవ్వాలంటూ చాయ్‌ మాస్టర్‌పై దాడి.. వీడియో

హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 2 వేల రూపాయలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు కొట్టాడు.

By అంజి  Published on  2 Sept 2024 11:30 AM IST
Hyderabad, young man brutally beat up the chai master, two thousand rupees, Crime

Hyderabad: దారుణం.. రూ.2 వేలు ఇవ్వాలంటూ చాయ్‌ మాస్టర్‌పై దాడి.. వీడియో

హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 2 వేల రూపాయలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు కొట్టిన ఘటన స్థానికులను సైతం భయభ్రాంతులకు గురి చేసింది. బాగ్ లింగంపల్లిలో అర్ధ రాత్రి ఓ పాన్‌షాప్ దగ్గరకి చోటు, నరేశ్ అనే ఇద్దరు యువకులు వచ్చారు. అక్కడ పనిచేసే చాయ్ మాస్టర్‌తో రూ.2 వేలు ఇవ్వాలని గొడవకు దిగారు. అందుకు డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఆగ్రహం చెందిన చోటు అనే యువకుడు చాయ్ మాస్టర్‌ను దారుణంగా కొట్టాడు.

పాన్‌ షాప్‌కి వచ్చిన కస్టమర్లపై కూడా దాడి చేశాడు. రూ.2 వేలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను దారుణంగా కొట్టిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. చాయ్‌ మాస్టర్.. దాడి చేసి యువకుడిపై బాగ్‌ లింగంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story