న్యాయవాది సంతోష్‌పై దాడి కేసు.. సీఎస్, డీజీపీ, బోరబండ ఎస్‌హెచ్‌వో, ఇతరులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: న్యాయవాదిపై బోరబండ పోలీసులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
By అంజి Published on 22 Aug 2024 8:03 AM ISTన్యాయవాది సంతోష్‌పై దాడి కేసు.. సీఎస్, డీజీపీ, బోరబండ ఎస్‌హెచ్‌వో, ఇతరులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: న్యాయవాదిపై బోరబండ పోలీసులు దాడి చేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం శాఖ, డీజీపీ, సీపీ హైదరాబాద్, బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకి నోటీసులు జారీ చేసింది. నోటీసులపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
అంతకుముందు, కోర్టు ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని సుమోటో పిటిషన్‌గా మార్చింది. న్యాయవాది పి.సంతోష్‌పై బోరబండ పోలీసుల అత్యుత్సాహంపై మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఆగస్టు 16న బోరబండ పోలీసులు అతడిపై దాడి చేశారు.
బోరబండ బంజారా నగర్‌లోని ఓ ఇంటిపై ఎస్‌ఐ సర్దార్ జమాల్, పీసీలు శ్రీనివాస్‌రాజ్, నాగేశ్వర్‌రావు తదితరులు దాడి చేశారు. న్యాయవాది పి. సంతోష్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి శారీరకంగా హింసించారు. విచారణ సమయంలో, న్యాయవాదిపై పోలీసులు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు.
"ఇది చాలా దురదృష్టకర సంఘటన" అని అదనపు అడ్వకేట్ జనరల్ అంగీకరించారు. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ముఖ్యమైన వ్యక్తులని, వారిని అత్యంత గౌరవంగా చూడాలని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే పునరుద్ఘాటించారు. ఈ మధ్య కాలంలో ఇది రెండోది. కౌంటర్‌తో పాటు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై సాధ్యాసాధ్యాల నివేదికను దాఖలు చేయాలని అదనపు ఏజీని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
కేసు నాలుగు వారాల పాటు వాయిదా పడింది.