టీ20 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఈ ఓటమిపై భారత్-పాక్ దేశాలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ వస్తున్నారు. మరో వైపు భారత జట్టు ఓటమి పాలవ్వడంతో భారత జట్టు ఆటగాళ్లను తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మొహమ్మద్ షమీని సోషల్ మీడియాలో తిడుతూ ఉన్నారు కొందరు. దీనిని తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ భారత్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడకుండా ఉండాల్సిందని.. ఈ విషయం తాను ముందే చెప్పానని అన్నారు.
ఓ వైపు పాకిస్తాన్ నుండి వచ్చే తీవ్రవాదులు భారత్ కు చెందిన సిపాయిలను చంపుతూ వెళుతుంటే.. మనం మ్యాచ్ ఆడడం ఏ మాత్రం మంచిది కాదని నేను బహిరంగంగా మ్యాచ్ కు ముందే చెప్పానని ఓవైసీ అన్నారు. ఇక క్రికెట్ మ్యాచ్ అన్నది 11 మంది ఆడే గేమ్ అని.. కానీ భారత్ ఓటమికి ఒక్క మహమ్మద్ షమీనే బాధ్యుడిని చేయడం తప్పని అన్నారు ఓవైసీ. ఇది భారత ముస్లింల మీద వివక్ష కాక మరేమిటని ప్రశ్నించారు.. 11 మందిలో ఒక్కడినే టార్గెట్ చేయడం చాలా తప్పు అని.. దీనిపై బీజేపీ కూడా స్పందించాలని ఓవైసీ డిమాండ్ చేశారు.