కేంద్ర మంత్రి అమిత్ షా కు లేఖ రాసిన ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi Letter To Amit Shah. మ‌జ్లిస్ పార్టీ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ శ‌నివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  3 Sep 2022 2:45 PM GMT
కేంద్ర మంత్రి అమిత్ షా కు లేఖ రాసిన ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ

మ‌జ్లిస్ పార్టీ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ శ‌నివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తాను ఆ లేఖ‌లో అమిత్ షాను కోరిన‌ట్లు ఓవైసీ తెలిపారు. ఈ లేఖను అమిత్ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఓవైసీ పంపారు. సెప్టెంబ‌ర్ 17న పాత‌బ‌స్తీలో తిరంగా యాత్ర‌తో పాటు బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌మ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజ‌ర‌వుతార‌ని ఓవైసీ అన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామ‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 17న హైద‌రాబాద్ సంస్థానం భార‌త దేశంలో విలీన‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ విమోచ‌నం కోసం హిందువులు, ముస్లింలు క‌లిసి పోరాటం సాగించార‌ని ఓవైసీ తెలిపారు.

నిజాం పాల‌న నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌లిగిన సంద‌ర్భాన్ని తెలంగాణ విమోచ‌న దినంగా పాటిస్తుంటారు. తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ ఏడాది అధికారికంగా నిర్వ‌హించ‌నున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ నెల 17న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వ‌హించేందుకు కేంద్రం నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మ‌హారాష్ట్ర, కర్ణాట‌క ముఖ్య‌మంత్రులు ఏక్‌నాథ్ షిండే, బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు హాజ‌రు కానున్నారు. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వంలోని ప‌లు శాఖ‌ల‌కు చెందిన అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.


Next Story