Hyderabad: విదేశీ యువతులతో వ్యభిచారం.. నిర్వాహకుడు అరెస్ట్
బయట బోర్డు ఒకటి.. లోపల వ్యవహారం మరొకటి.. నగరంలో పలుచోట్ల బయట స్పా మసాజ్ సెంటర్.. లోపల మాత్రం రహస్యంగా వ్యభిచార నిర్వహిస్తున్నారు.
By అంజి Published on 23 Aug 2024 9:13 AM ISTHyderabad: విదేశీ యువతులతో వ్యభిచారం.. నిర్వాహకుడు అరెస్ట్
హైదరాబాద్: బయట బోర్డు ఒకటి.. లోపల వ్యవహారం మరొకటి.. నగరంలో పలుచోట్ల బయట స్పా మసాజ్ సెంటర్.. లోపల మాత్రం రహస్యంగా వ్యభిచార నిర్వహిస్తున్నారు. ఇట్టి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా కొండాపూర్ లోని ఓ ఇండిపెండెంట్ ఇంట్లో ఏకంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో సైబరాబాద్ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.. ఆ ఇంటి పై దాడి చేసి, వ్యభిచార ముఠా వ్యవహారం కాస్త బట్టబయలు చేశారు. నిర్వాహకులను అరెస్టు చేసి యువతులను రక్షించారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్ ఓ ఇండిపెండెంట్ హౌస్ లో శివ కుమార్ అనే నిర్వహకుడు రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అంతర్జాతీయ యువతులతో అన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా ఆర్గనైజ్డ్‌గా వ్యభిచారం చేయిస్తున్నారు. పోలీసులకు పక్క సమాచారం రావడంతో ఆ ఇంటి పై దాడి చేసి.. కెన్యా దేశానికి చెందిన 14 మంది, యుగాండా దేశానికి చెందిన ఇద్దరు, టాంజానియా దేశానికి ఒకరు మొత్తం 17 మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకుని సేఫ్ హౌస్ కు తరలించారు.
నిర్వాహకుడు శివకుమార్ లోకాన్ టో వెబ్సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్నాడు. శివకుమార్ ఉపాధి పేరుతో విదేశీ యువతులకు ఆశ కల్పించి.. వారి చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇతను గత కొన్నాళ్ళుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యభిచారం దందా కొనసాగిస్తున్నాడు. నిర్వాహకుడు శివ కుమార్ తో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 4 మొబైల్ ఫోన్ లు, 25 హెచ్ ఐ వి కిట్ లు, మూడు సెక్స్ టాయ్స్, హుక్కా పాట్స్, 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.