Hyderabad: ఎగ్జామ్‌లో చిట్టీలు అందించలేదని విద్యార్థిపై దాడి.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌ నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ పరిధిలో ఓ విద్యార్థి ఎగ్జామ్‌లో చీట్టిలు అందించలేదని మరో విద్యార్థిపై దాడి చేశాడు.

By అంజి  Published on  7 Sept 2023 9:19 AM IST
attack, student, exam slips, Hyderabad

Hyderabad: ఎగ్జామ్‌లో చిట్టీలు అందించలేదని విద్యార్థిపై దాడి.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌ నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని పాతబస్తీ పరిధిలో ఓ విద్యార్థి ఎగ్జామ్‌లో చీట్టిలు అందించలేదని మరో విద్యార్థిపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి పరిస్థితి విషమం ఉన్నట్టు సమాచారం. పాతబస్తీ చాధార్ ఘాట్ పరిధిలో నివాసం ఉంటున్న కసబ్, ఆరిఫ్ ఒకే స్కూల్లో చదువుతున్నారు. పరీక్షల్లో సహకరించలేదని కసబ్ అనే విద్యార్థి తోటి విద్యార్థి పై దాడి చేశాడు. ఎగ్జామ్‌లో చిట్టీలు అందించలేదని కసబ్ అనే విద్యార్థి ఆగ్రహానికి లోనై ఆరిఫ్ అనే విద్యార్థితో గొడవపడ్డాడు.

మాట మాట పెరగటంతో కసబ్ ఆక్రోశంతో ఆరిఫ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో ఆరిఫ్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయిన ఆరిఫ్‌కి మెదడులో రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆరిఫ్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల్లో దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజీని ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story