హైదరాబాద్ సిటీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మంటల్లో చిక్కుకోవడంతో వరుసగా పేలుళ్లు సంభవించాయి. అనేక ఎయిర్ కండిషనర్లు మరియు వాషింగ్ మెషిన్ కంప్రెషర్లు పేలిపోయాయి, దీని వలన భవనం గుండా దట్టమైన పొగ మరియు మంటలు వ్యాపించాయి.
ఈ పేలుడు ఘటన కారణంగా ఒక కారు ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్పాట్‌లోని చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. ప్రధాన రోడ్డుపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో చుట్టుపక్కల నివాస ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలు ఇతర భవనాలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.