హైదరాబాద్‌లో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాటేదాన్‌లోని టాటానగర్‌లో ఓ ప్లాస్టిక్ సెగ్రిగేషన్ తయారీ యూనిట్‌లో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. యూనిట్ తయారీ నుంచి పొగలు పైకి వస్తున్నట్లు స్థానికులు గమనించి స్థానిక మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమీపంలోని పోలీస్ స్టేషన్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అటు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.