హైదరాబాద్‌లో మరో హవాలా రాకెట్ గుట్టు రట్టు

Another Hawala racket busted in Hyderabad. హైదరాబాద్ పోలీసులు మరో హవాలా రాకెట్‌ను ఛేదించి రూ.63.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

By Medi Samrat  Published on  23 Oct 2022 3:41 PM IST
హైదరాబాద్‌లో మరో హవాలా రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్ పోలీసులు మరో హవాలా రాకెట్‌ను ఛేదించి రూ.63.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్‌ బజార్‌లోని 'రానుజా మార్కెటింగ్‌' ఎలక్ట్రికల్‌ గోడౌన్‌ నుంచి హవాలా రాకెట్‌ నడుపుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సెంట్రల్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఐదుగురిని అరెస్టు చేసి నగదు, ద్విచక్ర వాహనం, ఐదు మొబైల్ ఫోన్లు, నగదు లెక్కింపు యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని కాంతిలాల్ (39), కిషోర్ సింగ్ (42), పెప్ సింగ్ (47), మహ్మద్ అబ్దుల్ ఫరీద్ (38), సందీప్ సింగ్ (31)లను అరెస్టు చేశారు.

హవాలా డబ్బులు వసూలు చేసి పంపిణీ చేస్తుండగా ఈ దాడి జరిగింది. నిందితుల వద్ద లెక్కల్లో చూపని డబ్బు దొరికింది. గత కొన్ని రోజులుగా నగరంలో హవాలా రాకెట్ల గుట్టు రట్టయింది. వేర్వేరుగా నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.10 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొరుగున ఉన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన‌ నిఘా పెట్టడంతో కోట్ల‌లో నగదు ప‌ట్టుబ‌డింది. అక్టోబర్ 20న నలుగురు వ్యక్తుల నుంచి రూ.1.10 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షైనయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో కారులో నగదు స్వాధీనం చేసుకున్నారు.


Next Story