హైదరాబాద్ : జూ పార్కులో ఊహించని విషాదం

హైదరాబాద్ జూ పార్కులో ఊహించని విషాదం చోటు చేసుకుందని. జూ పార్కులోని ఏనుగు దాడిలో తీవ్రంగా

By Medi Samrat  Published on  7 Oct 2023 12:59 PM GMT
హైదరాబాద్ : జూ పార్కులో ఊహించని విషాదం

హైదరాబాద్ జూ పార్కులో ఊహించని విషాదం చోటు చేసుకుందని. జూ పార్కులోని ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆనిమల్ కీపర్ శాబాజ్ (23) మృతి చెందాడు. అక్టోబర్ 7న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయంలో ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడిని తోటి సిబ్బంది దగ్గరలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే శాబాజ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడు శాబాజ్ పాతబస్తీ కాలపతర్ లో నివాసం ఉంటున్నాడు.

ఏనుగుకు భోజనం పెట్టడానికి వెళ్లినప్పుడు ఏనుగులు దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతడు ప్రతిరోజు ఏనుగులకు ఆహారం పెడుతూ ఉంటాడు. ఎప్పటిలాగే ఈరోజు కూడా షాబాజ్ ఉదయం ఏనుగులకు ఆహారం అందించడానికి వెళ్ళాడు. షాబాజ్ పై దాడి జరిగిన సమయంలోగట్టిగా అరవడంతో మిగతా జూ సిబ్బంది వెంటనే స్పందించి ఏనుగులను అక్కడి నుండి తరిమేశారు. షాబాజ్ మరణంతో అతడి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. షాబాజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Next Story