Hyderabad: ఆగివున్న ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.

By అంజి  Published on  25 Sept 2023 7:15 AM IST
RTC bus, Hyderabad, road accident

Hyderabad: ఆగివున్న ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పాతబస్తీ బహదూర్పురా ఎక్స్‌ రోడ్‌ దగ్గర సిగ్నల్‌ పడటంతో ఓ ఆటో ఆగింది. అదే సమయంలో రాజేంద్ర నగర్ డిపోకు చెందిన ఆర్టీసీబస్సు వెనుక నుండి వచ్చి ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు. బహదూర్పురా సిఐ, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఫస్ట్‌ ఎయిడ్‌ చేయించారు.

అందులో తీవ్ర గాయాలైన ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు తెలిపారు. జూ పార్కు నుండి పురాణ ఫుల్ వైపు వెళ్తున్న సమయంలో ఆటో బహదూర్పురా ఎక్స్‌ రోడ్ వద్ద సిగ్నల్ వద్ద ఆగగా వెనకాల నుండి ఆర్టీసీ బస్సు వచ్చి ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

Next Story