హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా.. రోడ్డు షో కు భారీగా కార్య‌కర్త‌లు

Amit Shah Road Show In Hyderabad. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం

By Medi Samrat
Published on : 29 Nov 2020 2:44 PM IST

హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా.. రోడ్డు షో కు భారీగా కార్య‌కర్త‌లు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా చార్మినార్‌ బయల్దేరి వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తరువాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్‌ మండి హనుమాన్‌ టెంపుల్‌ వరకు అమిత్ షా రోడ్‌ షో నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసులో ఉండి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్తారు.



హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా తెలంగాణ ప్రజల ఆప్యాయత గురించి తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ''హైదరాబాద్ చేరుకున్నాను. తెలంగాణ ప్రజల ఆప్యాయతకు మరియు మద్దతుకు ముగ్దుడనైయ్యాను.'' అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే.. హోంమంత్రి చార్మినార్ పర్యటన నేపథ్యంలో పాతబస్తీకి భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు అమిత్‌ షాకు ఘన స్వాగతం పలికేందుకు కాషాయ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.




Next Story