నేడు భాగ్యనగరానికి అమిత్ షా రాక.. పాతబస్తీలో ఎన్నికల ప్రచారం
Amit Shah Hyderabad Visit. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే
By Medi Samrat Published on 29 Nov 2020 10:41 AM ISTగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే జాతీయ స్థాయి నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి ప్రచారం చేయిస్తోంది. ఎన్నికల ప్రచారానికి ఫైనల్ పంచ్ ఇచ్చేందుకు నేడు భాగ్యనగరానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరానికి రానున్నారు. ఉదయం పదిన్నరకు ఆయన నగరానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళతారు.
భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత సనత్ నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు.అమిత్‌షా రోడ్‌షో సందర్బంగా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. అమిత్‌షా భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తూ ఉండటంతో.. పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ విభాగం. నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. అమిత్‌షా పర్యటన సమయంలో అల్లర్లు జరక్కుండా ఓల్డ్ సిటీ అంతటా భారీగా పోలీసులు మోహరించారు.
అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ :
-అమిత్ షా నవంబర్ 29 ఉదయం 8.30గంటలకి న్యూడిల్లీ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
-10.45గంటలకుకి విమానాశ్రయం నుండి రోడ్డుమార్గంలో బయలుదేరి 11.30గంటలకు పాతబస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. 11.30-11.45గంటల వరకు అమ్మవారిని దర్శించుకుంటారు.
-11.45గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం నుండి బయలుదేరి 12.15-13.30గంటల వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని(సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్) డివిజన్లలో పర్యటించనున్నారు.
-13.30 గంటలకు రోడ్ షోను ముగించుకుని 14.00గంటలకు నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. 14.00-15.00గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు.
-15.00-16.00 బిజెపి కార్యాలయంలోనే మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 18.00గంటలకు బిజెపి కార్యాలయం నుండి బయలుదేరి 19.00గంటలకు విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుండి మళ్లీ ప్రత్యేక విమానంలో డిల్లీకి బయదేరనున్నారు.