శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చివరి నిమిషంలో 8 విమానాల రద్దు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం ఎనిమిది విమానాలను రద్దు చేయడంపై అలయన్స్
By అంజి Published on 10 April 2023 6:45 AM GMTశంషాబాద్ ఎయిర్‌పోర్టులో చివరి నిమిషంలో 8 విమానాల రద్దు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి సోమవారం ఎనిమిది విమానాలను రద్దు చేయడంపై అలయన్స్ ఎయిర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానయాన సంస్థ.. విమానాల రద్దుకు సాంకేతిక సమస్యలను పేర్కొంది. దీంతో తిరుపతి, బెంగళూరు, విజయవాడ, మైసూర్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తమ ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న ప్రయాణికులను హఠాత్తుగా విమానాలు రద్దు షాక్‌కి గురి చేసింది. అనేక మంది అలయన్స్ ఎయిర్ యొక్క పేలవమైన సేవలపై తమ నిరాశను వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్ నిర్వహణ నుండి మెరుగైన కమ్యూనికేషన్‌ను డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన విమానాలతో పాటూ ఇక్కడకు రావాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. ఆపరేషనల్ సమస్యల కారణంగా చెబుతూ అలయన్స్ ఎయిర్ సర్వీసులను రద్దు చేసింది. రద్దు విషయంలో తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, టిక్కెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని అధికారులు చెప్పడంతో వారు శాంతించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన హైదరాబాద్ - తిరుపతి, హైదరాబాద్ - బెంగుళూరు, హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - మైసూరు విమానాలను రద్దు చేశారు.
ఇతర ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 4 సర్వీసులు కూడా రద్దు చూశారు. వీటిలో చెన్నై, తిరుపతి, బెంగుళూరు, మైసూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలు ఉన్నాయి.