ఎంఐఎం పోటీ చేసే స్థానాలు ఇవేనట!

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రాబోయే లోక్‌సభ 2024 ఎన్నికలలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి పోటీ చేయనుంది. హై

By Medi Samrat  Published on  4 Feb 2024 8:29 PM IST
ఎంఐఎం పోటీ చేసే స్థానాలు ఇవేనట!

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రాబోయే లోక్‌సభ 2024 ఎన్నికలలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి పోటీ చేయనుంది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్, ఔరంగాబాద్, కిషన్‌గంజ్ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

“ఇన్షా అల్లా, లోక్‌సభలో ముస్లిం వాణిని బలోపేతం చేయడానికి ఓటర్లు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. ఎఐఎంఐఎం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రార్థించాలని, మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్ ప్రజలు ఐక్యంగా ఉండి విభజన శక్తులను ఓడించాలని అసదుద్దీన్ అభ్యర్థించారు. "హైదరాబాద్ ప్రజలు ప్రత్యర్థుల దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టాలి. ఈ పరీక్షా కాలంలో ఐక్యంగా ఉండాలి" అని ఆయన అన్నారు.

Next Story